ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు టోపీ పై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలని సూచించారు. ఇలా అమ్ముడు పోయి ప్రజా స్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా వృత్తిని కించపరచడమే అవుతుందన్నారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదన్నారు. చంద్రబాబు ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తామని హెచ్చరించారు జగన్.
అన్నీ బయటకు తీసి చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ దగ్గరుండి బయటికి తీస్తాం. రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. ప్రతీ పోలీస్ ఆఫీసర్ కి చెబుతా ఉన్నాం. చట్టం దగ్గర దోషులుగా నిలబెడుతాం. కోర్టు ఆర్డర్లను అధిగమించి.. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడితే వారిపై మా ప్రభుత్వం తప్పక చర్యలుంటాయి. రెడ్ బుక్ వాల్లు ఒక్కరే కాదు పెట్టుకునేది.. ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరు అయితే ఉన్నారో ఆ ప్రతీ కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుందన్నారు మాజీ సీఎం జగన్.