గుడివాడ అమర్‌నాథ్ కు జగన్ కీలక పదవి ఇచ్చారు. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైకాపా అధిష్టానం. దింతో రేపు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ బాధ్యతలు తీసుకోనున్నారు.

అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ మోహన్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది.