టీడీపీ నేత దారుణ హత్య… నారా లోకేష్ సీరియస్

-

టీడీపీ నేత దారుణ హత్య నేపథ్యంలో… నారా లోకేష్ సీరియస్ అయ్యారు. సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య వార్త నన్ను షాక్ కు గురి చేసిందన్నారు లోకేష్. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం అన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారని తెలిపారు.

lokesh

హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు నారా లోకేష్. కాగా, టీడీపీ నేత, అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి దారుణ హత్య జరిగింది. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని హత్య చేసారు దుండగులు. ఒంగోలు-పద్మ టవర్స్‌లోని ఆఫీసులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. వీరయ్య చౌదరి మృతదేహం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

.

Read more RELATED
Recommended to you

Latest news