సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నా.. చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు – జవహర్

-

సర్వేలు నాకు అనుకూలంగా ఉన్న నాకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి జవహర్. ప్రజలందరు జవహర్ కావాలి అని కోరుకుంటున్నారు.. కాని నాకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు కేవలం పెత్తందారులని సంతృప్తి పరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జవహర్.

Former minister Jawahar slams chandrababu

ఈ సారి ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయటం ఖాయమని…పోటీ ఎలా అనేది కార్యకర్తల అభిష్టం మేరకు వెళతానని వెల్లడించారు జవహర్. కొవ్వూరులో ఉన్న 11 మంది ఆశావాహులు కాదని స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటూ చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.

నాకు కాదంటే నా తనయుడికి టికెట్ ఇవ్వండి….టిడిపి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రిగా ఉన్న నాతో సంప్రదించకుండా టిక్కెట్ కేటాయించడం ఏమిటి అంటూ నిప్పులు చెరిగారు జవహర్. మా పోరాటం చంద్రబాబుతో కాదు పెండ్యాల అచ్చిబాబుతో తేల్చుకుంటా అంటూ ఫైర్‌ అయ్యారు జవహర్. ఇక జవహర్ చేసిన వ్యాఖ్యలతో ఆయన వైసీపీలోకి వెళతారని అందరూ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news