మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కీలక ప్రకటన చేశారు. తనకు అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. తాను రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాయదుర్గం టీడీపీ అభ్యర్థిని తానేనంటూ ప్రకటించుకున్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, మరో పదేళ్లు తాను రాయదుర్గంలోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఈ నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎల్లుండి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ మండలిలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చంద్రబాబు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు, మాజీమంత్రి గంటా రాజీనామా ఆమోదం పైనా చర్చించనున్నట్లు సమాచారం.