చంద్రబాబుకు బెయిల్ మంజూరు సంతోషకరం : మాజీ కేంద్ర మంత్రి డా.చింతా మోహన్

-

చంద్రబాబుకు బెయిల్ మంజూరు సంతోషకరం అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్. ఆలస్యం అయినా చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. చంద్రబాబును మళ్లీ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మళ్లీ అరెస్ట్ చేసి ఆ తప్పు చెయ్యవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుకుంటున్నాను. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపి, వైసీపీ పాత్ర ఉందని ప్రజలు నమ్ముతున్నారు.బీజేపి జోక్యంతో చంద్రబాబు అరెస్ట్ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి.

దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి. ప్రేమతో రాజకీయాలు నడపాలి. బైబిల్ చదివే వారికి కక్షసాధింపులు ఉండకూడదు. దేశవ్యాప్తంగా లిక్కర్ పాలసీలో లోపాలు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నే కాదు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న పాలసీలో ఇబ్బందులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news