ఏపీలో ఉన్న ఆ వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్‌పాస్‌లు

-

 

ఏపీలో ఉన్న ఆ వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్‌పాస్‌లు ఇచేందుకు జగన్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఆసరా పింఛన్ల కింద రూ. 10,000 పొందుతున్న వ్యాధిగ్రస్తులకు ఉచిత బస్ పాస్ లు అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సికెల్ సెల్ ఎనీమియా, థలసేమియా వంటి రోగాలతో బాధపడే వారికి దీనివల్ల ప్రయోజనం ఉంటుందని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు.

ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి ప‌రిపాల‌న‌లో ప‌ల్లెసీమ‌లు అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్నాయ‌ని తెలిపారు.త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఏకంగా రూ.6 కోట్ల నిధుల‌తో మంచినీరు అందించే ప‌నుల‌కు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. రోజుకు ఒక మిలియ‌న్ లీట‌ర్ల నీటిని గ్రామ‌స్తుల‌కు అందించే సామ‌ర్థ్యంతోట్రీట్ మెంట్ ప్లాంట్ ను ఏర్పాటుచేశామ‌ని చెప్పారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల ఏకంగా 7వేల మంది జ‌నాభాకు మంచినీటి అవ‌స‌రాలు తీర్చే వెసులుబాటు క‌లిగింద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news