క్యాన్స‌ర్‌, కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

-

క్యాన్స‌ర్‌, కిడ్నీ లాంటి ప్రాణాపాయ రోగుల‌కు ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారు పూర్తిస్థాయిలో అండ‌గా నిల‌బ‌డ్డార‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల రజిని గారు తెలిపారు. వైద్య ఆరోగ్య‌శాఖ అన్ని విభాగాల అధిప‌తులతో మంత్రి రజినీ మంగ‌ళ‌గిరిలో ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ ప్రధాన కార్యాల‌యంలో ఉన్న‌త స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోని అన్ని క్యాన్స‌ర్ ఆస్ప‌త్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం క‌చ్చితంగా 5 శాతం ప‌డ‌క‌ల‌ను కేటాయించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. కిడ్నీ రోగుల‌కు మ‌రింత మెరుగైన వైద్య‌సేవ‌లు అందించేందుకు ప‌లాస‌లో కిడ్నీ రీసెర్చి సెంట‌ర్‌ను అతి త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు గారు, కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ మంజుల‌ గారు, క‌మిష‌న‌ర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్‌ గారు, ఏపీవీవీపీ క‌మిష‌న‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు గారు, ఆరోగ్య‌శ్రీ సీఈవో హ‌రీంధ్ర‌ప్ర‌సాద్‌ గారు, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ ముర‌ళీధ‌ర్‌రెడ్డి గారు, డీఎంఈ న‌ర‌సింహం, డీహెచ్ రామ‌రెడ్డి గారు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news