చంద్రబాబు చేతుల మీదుగా ఈనెల 31న ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. ఈ నెల 31న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సూపర్ సిక్స్ లో ప్రధానమైనది 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని.. 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు లాభం కలిగిందుకు ఈ ఆలోచన అన్నారు. అక్టోబర్ 31 మొదటి డెలివరీ రోజు జరుగుతుందని తెలిపారు. ఖాళీ సిలిండర్, LPG కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని కోరారు.
ఈ నెల 29 నుంచీ బుకింగ్ చేసుకోవచ్చు అని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 31న ఉచిత సిలిండర్ల కార్యక్రమం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఒక మెసేజ్ వెళుతుందని… పట్టణాలలో 24 గంటలలోపు, గ్రామాలలో 48 గంటలలోపు సిలిండర్ డెలివరీ అన్నారు. సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల లోపు సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు వస్తుందని తెలిపారు. 29న ఆయిల్ కంపెనీలకి మొదటి చెక్ ఇస్తున్నామన్నారు.