రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు కార్యాలయంలోని నలుగురు అధికారులకు శాఖలను శనివారం ఖరారు చేసింది. వారు పర్యవేక్షించాల్సిన శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముద్దాడ రవిచంద్ర, ఏవీ రాజమౌళి, ప్రద్యుమ్న, కార్తికేయ మిశ్రాకు పలు విభాగాలను అప్పగించింది. ఇక నుంచి రవిచంద్ర సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ, హోం, ఆర్థిక, ఎక్సెజ్, రెవెన్యూ, దేవాదాయ శాఖలను చూడనున్నారు.
రాజమౌళికి, జలవనరులు, విద్యుత్, గనులు వ్యవసాయం, సీఎంఆర్ఎఫ్, ఫిర్యాదులు తదితర శాఖలను కేటాయించారు. అదేవిధంగా ప్రద్యుమ్నకు రవాణా, పురపాలక, పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్, అటవీ, పౌరసరఫరాల శాఖలను, కార్తికేయకు ఐటీ, ఎస్ఆర్ఎస్ఐ వ్యవహారాలు, సమాచార పౌర సంబంధాలు, సీఎం ఢిల్లీ, విదేశీ పర్యటనలను చూడనున్నారు. ఇంకా మున్ముందు కొన్ని శాఖలను ఇతరులకు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.