ఏపీ రైతులకు శుభవార్త… వచ్చేవారం నుంచి కందుల కొనుగోలు ప్రారంభం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. ప్రస్తుత సీజన్ లో దేశవ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందులను సేకరించాలని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్బికే అధికారులు వచ్చే వారం నుంచి రైతుల నుంచి కందుల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.

Goat purchase will start from next week

ఇందులో ఏపీలోని ఆర్బికేల నుంచే ఏకంగా 50 వేల టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆర్ బి కే అధికారులు వచ్చేవారం నుంచి కందులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కనీసం మద్దతు ధరకు మించి క్వింటాల్… 9500 నుంచి 100,500 వరకు ఉంది.

ఇప్పుడు ఏపీ రైతుల నుంచి కూడా అదే ధరకు కొనుగోలు చేసేందుకు జాతీయ సంస్థ సిద్ధమైంది. కాగా, నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్‌ పెంపు సహా పలు కీలక అంశాలపై చర్చించనుంది ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్‌.

Read more RELATED
Recommended to you

Latest news