రాజమండ్రి వద్ద గంట గంటకు పెరుగుతున్న గోదావరి వరద..!

-

రెండు తెలుగు రాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు అదే రేంజ్ లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కృష్ణ, గోదావరి నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కృష్ణమ్మ కొంచెం శాంతించిన.. గోదావరి మాత్రం తగ్గడం లేదు. రాజమండ్రి వద్ద గోదారి వరద నీటిమట్టం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద. గోదావరి వరద నీటిమట్టం 9 పాయింట్ 2 అడుగులకు చేరింది . బ్యారేజ్ నుండి 6లక్షల 45వేల 140 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల. చేస్తున్నారు.

బ్యారేజి కి సంబంధించిన 175 గేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీనితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదల చేసే మిగులు జలాలు 10 లక్షలకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం గంటకు ఒక పాయింట్ చొప్పున నీటిమట్టం ఎక్కువ అవుతూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news