కోకాపేటలో రూ.1200 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న సర్కార్

-

హైదరాబాద్​లోనే అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్‌ కోకాపేట్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ గజం భూమి కోట్ల రూపాయల్లో ధర పలుకుతోంది. అయితే ఇంత ఖరీదైన భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. దాదాపు రూ.1200 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. దీంతో దీనిపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకున్నారు.

పుప్పాలగూడ, ఔటర్​ రింగ్ రోడ్డు, నియో పొలీస్‌కు రెండు, మూడు కిలోమీటర్ల సమీపంలో ఏకంగా రూ.1200 కోట్ల విలువైన భూములను ఆక్రమించి ఇళ్లు, రేకుల షెడ్లు, ఫుడ్‌ కోర్టుల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇటీవల గండిపేట్‌లోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల వివరాలను రికార్డుల్లో అధికారులు పరిశీలించగా కోకాపేట్‌ సర్వే నంబర్‌ 100లో 16 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నట్లు తేలింది.

గండిపేట్‌ తహసీల్దార్‌ ఎన్‌.శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల క్రితం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. దీంతో అక్కడ  16 ఎకరాల ప్రభుత్వ భూమిలో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు గమనించారు. వారిని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా వినకపోవడంతో మంగళవారం రోజున అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసి అక్కడి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news