అమరావతి రైతులకు… అదిరిపోయేవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. వాళ్లకు పెన్షన్లు, ఆర్థిక సహాయం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ల్యాండ్ పూలింగ్ సిస్టం ద్వారా రైతుల నుంచి ఏకంగా 30,000 ఎకరాలకు పైగా తీసుకుంది ప్రభుత్వం. అలాంటి రైతులకు… మరో ఐదు సంవత్సరాల పాటు కౌలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. భూమి ఇచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం ఏటా కౌలు… తెలుస్తూనే రావడం జరిగింది.
అయితే 10 సంవత్సరాలపాటు కౌలు చెల్లించాలని.. 2014లో గెలిచిన టిడిపి నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు పది సంవత్సరాలు దాటింది. ఈ నేపథ్యంలో మరో ఐదు సంవత్సరాలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు.. కవులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అలాగే రైతు కూలీలకు పెన్షన్లను మరో ఐదు సంవత్సరాలపాటు ఇవ్వాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది.