ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త అందించారు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యవసరాల వస్తువుల ధరలపై నియంత్రణ దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేయడం జరిగింది. తాజాగా సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు.

Chandrababu government good news for ration card holders

ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా అలాగే డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసరాల ధరల నియంత్రణ పైన కీలక చర్చ నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు. రేషన్ కార్డు ఉన్నవారికి తక్కువ ధరలో అన్ని సరుకులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమయ్యేలా చూసుకోవాలని పేర్కొన్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకే కందిపప్పు అలాగే బియ్యం ఇవ్వాలని తెలపడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version