ఏపీ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..ఇకపై ప్లే గ్రౌండ్స్ కూడా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాతలు ముందుకొస్తే పంచాయతీలలో ప్లే గ్రౌండ్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రకటించారు. పంచాయతీ శాఖలో 25 వేల కోట్ల స్కాం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకమన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 70% వైసీపీకి సంబంధించిన సర్పంచ్ లే అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
స్వర్ణ గ్రామాల అభివృద్ధి నా లక్ష్యమని చెప్పారు. సినిమాలను రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తానని… అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయని చెప్పారు. గత ప్రభుత్వం 51 వేల కోట్లు ఖర్చు పెట్టమన్నారు…అయితే 25 వేల కోట్లు ఏమై పోయాయో తెలియాలని పేర్కొన్నారు. అన్నా హజారే సర్పంచిగా గెలిచి దేశంలోనే మార్పు తీసుకొచ్చారు…ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశంలో మార్పు తేవచ్చని ఆయన నిరూపించారని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.