ఏపీ గ్రామపంచాయతీలకు శుభవార్త… రూ.1072.92 విడుదల

ఏపీ గ్రామపంచాయతీలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్‌ రోడ్లను రూ.1072.92 కోట్లతో బాగుచేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి 2022 వరకూ మొత్తంగా 3,705 కి.మీ మేర పంచాయతీరాజ్‌ రోడ్ల కొత్త కనెక్టివిటీ, అపగ్రేడేషన్‌ కోసం రూ.2131 కోట్లు ఖర్చు కాగా… ఇవికాకుండా 444 కి.మీ మేర బీటీ అప్రోచ్‌ రోడ్ల కోసం రూ.308 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.

కొత్తగా 38 ఆర్వోబీల పూర్తికి రూ.2,661 కోట్లు ఖర్చుచేస్తున్న ఏపీ ప్రభుత్వం… ఏపీలో మరో 7 జాతీయ రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేసింది. వీటికి ఏడాదిలోగా భూ సేకరణ పనులు పూర్తిచేసి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న అధికారులు…3,004 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ రహదారుల కోసం దాదాపు రూ.41,654 కోట్లు ఖర్చు చేస్తోంది సర్కార్‌.

బెంగుళూరు-విజయవాడ, ఖమ్మం-దేవరపల్లి, మదనపల్లె-పీలేరు, రేణిగుంట-నాయుడుపేట, ముద్దనూరు-బి.కొత్తపల్లి-గోరంట్ల, తాడిపత్రి-ముద్దనూరు, మైదుకూరు-పోరుమామిళ్ల–సీతారాంపురం-మాలకొండ-సింగరాయకొండ రోడ్లు జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తోంది.