ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ..!

-

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక ఇంటింటికే వెళ్లి పింఛన్ల పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. పెన్షన్ల కోసం ఎదురు చూడకుండా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిణీ  చేస్తుంది. అయితే ఒక్కోసారి ఒకటో తారీఖు ఆదివారం వచ్చినా, సెలవు దినాల్లో వచ్చినా సరే పెన్షన్ తర్వాత ఇవ్వకుండా, ఒకటో తేదీ కంటే ముందే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఒకటో తేదీన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు  పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news