లెనినిజం సిద్ధాంతాల పునాదులపై సీపీఐ ఆవిర్భవించిందని సీపీఐ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీ 100వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ప్రజల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేస్తోందని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఇంకా అమలు కావడం లేదని తెలిపారు. భూములు, కార్మికుల హక్కులు సీపీఐ పోరాటం వల్లనే వచ్చాయన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత రాజ్యాంగానికే ప్రమాదం వచ్చి పడిందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా మాట్లాడారు. కాన్పూర్ లో సీపీఐ ఆవిర్భవించి నేటికి వందేళ్లు అవుతుందని తెలిపారు. భారత దేశ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీది ప్రముఖ పాత్ర అని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్టు వివరించారు. రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్ బీజేపీ కార్యకర్తల్లా తయారయ్యారని విమర్శించారు.