కడప నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 52 వేల జీతం..పూర్తీ వివరాలు ఇవే..

-

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ ను అందించింది.ఏపీ వైద్య విధాన పరిషత్‌, కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన బయో మెడికల్‌ ఇంజినీర్, కౌన్సెలర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: బయో మెడికల్‌ ఇంజినీర్‌, కౌన్సెలర్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, ప్లంబర్, థియేటర్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రీషియన్‌ పోస్టులు

వయస్సు: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

జీతం: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: District Coordinator of Hospital Services, YSR Kadapa District, AP.

దరఖాస్తు ఫీ:

జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500

ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 300

వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 2, 2022.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తీ వివరాలను నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version