విజయవాడ అమ్మవారి భక్తులకు శుభవార్త…ప్రతి ఒక్కరికీ ఒక లడ్డూ ఉచితం ఇచ్చేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ… దుర్గాదేవి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకున్నా… గొప్ప వైధిక సభను చూశానని తెలిపారు. వేధోచ్ఛారణ సకల జనులకు మేలు చేస్తుందని…ఈ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.
విజయదశమి రోజున అందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామని.. భక్తులందరికీ బంగారువాకిలి నుంచే దర్శనం ఉంటుందన్నారు. దర్శనానికి వచ్చే ప్రతీ భక్తునికి ఒక లడ్డూ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భవానీ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తామని వెల్లడించారు. మూలానక్షత్రం రోజున సుమారు లక్షా 20 వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భక్తుల సంఖ్యను పెంచి చూపించుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని వివరించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.