జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి రేషన్ సరాఫరా కోసం వినియోగిస్తున్న ఎండియు వాహన యజమానులకు కూడా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.
సొంతవాహనం కలిగిన అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేల చొప్పున ఇస్తుండగా, ఇకపై ఎండియు డ్రైవర్ల అకౌంట్ లో కూడా జమ చేయనుంది. దీంతో వేలాది మందికి కొత్తగా లబ్ది చేకూరనుంది. అటు సంక్షేమ పథకాలకు నిధులకు సర్దుబాటు చేయడం వల్ల గతంలో జీతాల చెల్లింపు ఆలస్యమైందన్నారు. ఈ నెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఉద్యోగుల మద్దతు తెలపాలన్నారు. ఉద్యోగులకు వచ్చే నెల ఒకటినే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గతంలో జీతాల చెల్లింపులు ఆలస్యం కావడానికి కొందరు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.