ఏపీ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిఆర్సి అమలుకు సంబంధించి ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నీ కలిపి పేస్కేలు కనిష్టంగా రూ. 29,100, గరిష్టంగా రూ. 2,59,895గా నిర్ణయించారు. ఉద్యోగులకు 24.99% DA, 8% ఫిట్మెంట్ లభించనుంది.
12 వాయిదాల్లో PRC బకాయిలు చెల్లించనుండగా… 2022 ఏప్రిల్ 1వ తేదీకి ముందు సర్వీస్ లో ఉన్న ఉద్యోగులందరూ ఈ కొత్త పిఆర్సి పరిధిలోకి రానున్నారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. జగనన్న విద్యా దీవెన పథకం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 28వ తేదీన చిత్తూరు జిల్లా నగరిలో ఈ పథకం మూడవ క్వార్టర్ అమౌంట్ ను బటన్ నొక్కి నేరుగా విడుదల చేయనున్నారు సీఎం జగన్.