ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఈ బదిలీలు వర్తిస్తాయి. ఆన్ లైన్ ద్వారా బదిలీ దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరించనుంది.
వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ ఉంటుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నిన్న కాక మొన్ననే జగన్ ఈ శుభవార్త చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన. శనివారం రోజునఆయన ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్ మీద సంతకం చేశారు. ఈ నేపధ్యంలో టీచర్స్ బదిలీలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని వార్తలు రాగా ఆ ఉత్తర్వులు ఈరోజు వెలువడ్డాయి.