అక్కడ బీజేపీలో వర్గపోరు మాములుగా లేదుగా…!

-

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పే పార్టీ నాయకత్వం మూడు గ్రూపులుగా విడిపోయి అంతర్గత పోరుతో రచ్చకెక్కడం కమలం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది. నల్గొండ జిల్లాలో అంతంత మాత్రంగా ప్రభావం ఉన్న బీజేపీని ఆ పార్టీలోని ముఖ్య నేతల మధ్య వర్గపోరు ఆ పార్టీ ని మరింత బలహీనం చేస్తుందట. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన కంకణాల శ్రీధర్‌రెడ్డి ఏకపక్షంగా జిల్లా కార్యవర్గాన్ని నియమించుకున్నారన్న అసంతృప్తి పార్టీలో కొత్త రచ్చకి తెర తీసిందట..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పార్టీలోని ముఖ్య నేతల మధ్య వర్గ పోరు ఇప్పుడు కొత్త సమస్యగా మారింది. ఇప్పటికే ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుండగా అది పక్కన పెట్టి ఆధిపత్యం కోసం పోట్లాడుకోవడం గందరగోళానికి తెరలేపింది. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ ఈ సారి నల్లగొండ ఖమ్మం వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానంపై పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ బిజేపి లో గ్రూపుల లొల్లి విజయావకాశాలను ప్రశ్నార్థకం చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. మరీ పార్టీ పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news