గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.
తమ ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులను ఈ హెచ్ ఎస్ పరిధిలోకి తీసుకురావాల్సి ఉండటంతో, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియకు జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.