ఏపీలో కరోనా ఎఫెక్ట్‌తో ఆర్టీసీకి భారీగా ఆదాయం పడి పోయింది. ఈ క్రమంలో ఆర్టీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాల సర్వే చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆర్టీసీ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీకి 13 జిల్లాల్లో 1900 ఎకరాల స్థలం ఉన్నట్టు గుర్తించారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ స్థలాల టైటిల్ డీడ్స్ డాక్యుమెంట్లను పరిశీలనకు ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి.
అవసరమైన మేరకు ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించాలని యోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు. సుమారు 350 ఎకరాల ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని అంటున్నారు. ఆర్టీసీ స్థలాల ద్వారా ఆదాయం ఏ విధంగా పొందచ్చనే అంశం పైనా మార్గాల అన్వేషణలో ప్రభుత్వ వర్గాలు ఉంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఆర్టీసీ స్థలాల లీజులు.. ఇతర లావాదేవీల వ్యవహరంలో అక్రమాల జరిగాయనే కోణంలోనూ ఆరా తీస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.