రైతులకి కేసీఆర్ గుడ్ న్యూస్ : వానకు పాడైన వరి, పత్తి కూడా ప్రభుత్వమే కొనుగోలు 

-

తెలంగాణ రైతులకి కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణలో వానాకాలంలో సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పంటల కొనుగోలుపై ఆయన ఇవాళ ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం 6వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం మొత్తాన్ని కొనాలని ఈ సమావేశంలో అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

పంటలకు పెట్టుబడి అందించడం నుంచి వాటిని కొనుగోలు చేయడం వరకూ ప్రభుత్వమే చేస్తోందని వెల్లడించారు కేసీఆర్. అలానే రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దన్న కేసీఆర్ కనీస మద్దతు ధర ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో గైడ్‌ లైన్స్ విడుదలవుతాయని ఆయన పేర్కొన్నారు. పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news