గ్రామ వాలంటీర్ల ద్వారా నిఘా వేయడం తప్ప ప్రభుత్వం చేసింది ఏంలేదు – సిపిఎం రాఘవులు

-

రాష్ట్రంలోని భూ ఆక్రమణలపై ఓ ఉన్నత స్థాయి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పోలీట్ బ్యూరో సభ్యుడు రాఘవులు. భూముల సమస్యల పరిష్కారం చూపాలని అన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వం నిఘా వేయడం తప్ప ఏం చేయడం లేదన్నారు. దోచుకోవడం కోసమే ప్రభుత్వం వికేంద్రీకరణ అని పదే పదే మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటుందని ఆరోపించారు.

పెద్దలు ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందన్నారు. భూములను నమ్ముకున్న రైతులు కూడా కాంట్రాక్ట్ కూలీల్లా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పేదల భూములకు అతి పెద్ద ప్రమాదం రాజకీయ నేతల నుంచే వస్తోందని.. పెట్టుబడిదారులు, భూస్వాముల కంటే ఎక్కువ దొపిడీ రాజకీయ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు.

చిన్నపాటి సంతకాలతో.. కబ్జాలతో రాత్రికి రాత్రే రాజకీయ నేతలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ స్కీముల ద్వారా డబ్బులిస్తారేమే కానీ.. భూములివ్వరని అన్నారు రాఘవులు. పెద్దల చేతుల్లో అక్రమంగా ఉన్న భూముల విముక్తి కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news