పవన్ కళ్యాణ్‌.. ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుతున్నారు – గ్రంధి శ్రీనివాస్ కౌంటర్‌

-

జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ అని.. పవన్ కళ్యాణ్‌.. ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుకున్నారని.. గ్రంధి శ్రీనివాస్ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ కౌంటర్‌ ఇచ్చారు. భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగం తుస్సుమనిపించారని… యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారు అంటూ అబద్ధాలు ఆడారని ఆగ్రహించారు.

సీఎం జగన్ మ్యానిఫెస్టోను భగవద్గీతా, బైబిల్, ఖురాన్ గా భావిస్తారు..ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్ అన్నారు. పవన్ కళ్యాణ్‌ తనని తాను ఎందుకు మోసం చేసుకుంటారు..? మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టీ చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారన్నారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధ పడ్డాయి.. మీరు చేసిన దాస్టికాలు భరించ లేక ప్రజలు మిమ్మల్ని ఓడించారని చురకలు అంటించారు గ్రంధి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version