భీమవరం అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ ను ప్రకటించారు ఏపీ సీఎం జగన్. సినిమా హీరో మళ్ళీ భీమవరం వస్తా అంటున్నారు.. అతని పై మరోసారి గ్రంధి శ్రీనివాస్ ను నిలబెడుతున్నానని CM జగన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్… కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్.. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…ఏ భార్యతో మూడేళ్లు కాపురం చేయడు మ్యారేజి స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు.పెళ్లి అనే పవిత్ర సంప్రదాయం పక్కన పెట్టి.. కార్లు మార్చుతున్నట్టు భార్యలను మర్చుతున్న పెద్ద మనిషి గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు..ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు చేస్తే మన చెల్లెళ్ళు, అక్కల పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం జగన్. విలువలు, విశ్వసనీయత అసలు లేకుండా పరిపాలన చేసిన వాళ్ల గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం జగన్.