పేకాట కేసులో మంత్రి సోదరుడు అరెస్ట్.. సాయంత్రం మీడియా ముందుకు ?

-

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో నిన్న భారీ పేకాట స్థావరంపై ప్రత్యేక పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుమారు 5 లక్షల నగదు, 42 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి స్వగ్రామం కావడం మంత్రి జయ రామ్‌ కు వరుసకు సోదరుడయ్యే నారాయణ అనే వ్యక్తి ఈ స్థావరాన్ని నిర్వహిస్తుండడంతో పేకాట వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి ప్రకటించారు.

అయితే మంత్రి జయరాం సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్నటి నుంచి పరారీలో ఉన్న నారాయణ, అతడి అనుచరులు జగన్‌, శ్రీధర్‌లను చిప్పగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. నారాయణ గుమ్మనూరు పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు నిర్థారించారు. అతనిపై కేసు నమోదు చేయాలని అడిషనల్‌ ఎస్పీ గౌతమి పోలీసులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news