Gummanur Jayaram comments viral: టీడీపీ లో ముసలం నెలకొంది. గుమ్మ నూరు జయరాం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గం పై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు హాల్ చల్ చేస్తున్నాయి. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓడిన వ్యక్తి పెత్తనం ఏంటంటూ గుమ్మ నూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడీపీ ఆలూరు ఇంచార్జి వీరభద్ర గౌడ్ పై కామెం ట్స్ చేశారు గుమ్మనూరు జయరాం. గెలిచిన ఎమ్మెల్యేను నేను, గెలవడం చేతగాక ఓడిన వ్యక్తి మాట చెల్లు బాటు అవుతుందా అంటూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు చేశారు. దీంతో గుమ్మ నూరు జయరాం, వీరభద్ర గౌడ్ మధ్య రచ్చకెక్కాయి విబేధాలు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.