వైసీపీకి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడారు. 12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశాను…రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను.. మంత్రి పదవి చేశానని వెల్లడించారు. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నాను….చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానని వెల్లడించారు. ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నా.. ఎంపీ పదవి వద్దన్నాను….మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

మా కులం ఎక్కువగా రెండు జిల్లాల్లో ఉన్నారు….గుంతకల్ నుంచి పోటీ చేయడానికి నేను సుముఖంగా ఉన్నానన్నారు. నా సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉంది.. కాబట్టి నేను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని వెల్లడించారు. కర్ణాటకలో నా సోదరుడు మంత్రిగా ఉన్నారంతే.. నేనేమీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో లేనని తెలిపారు. సీఎం జగన్ నా.. నా.. అంటున్నారు.. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీలకు న్యాయం జరగలేదని ఫైర్ అయ్యారు. ఓ బోయను.. ఓ ఎస్సీ.. ఓ ముస్లింలను తీసేశారని మండిపడ్డారు. 2022 వరకు జగన్ను ఓ దేవుడిగానే చూశాను…2022 తర్వాత జగన్ విగ్రహంగా మారారన్నారు గుమ్మనూరు జయరాం.