సెక్రటేరియట్ తాకట్టుపై ప్రధాని మోడీకి లేఖ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెట్టిన వైనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయనకు సుదీర్ఘమైన లేఖ రాసినట్లు రఘురామకృష్ణ రాజు వివరించారు. ఎక్కడా లేనిది కనీ విని ఎరగని రీతిలోఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సెక్రటేరియట్ ను జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేశారని, బటన్ నొక్కడం కోసమో, సొంత ఖర్చులకోసమో తెలియదు కానీ 350 కోట్ల రూపాయలకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడాన్ని ఏమనాలి?, ఏమి చేయాలి అంటూ ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ

మనం ఏమి చేయగలం… ఓటు అనే ఆయుధం ద్వారా ఓడించగలం అంతేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రెండు రోజుల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసేందుకు సమయాన్ని కోరినట్లు తెలిసిందని, ఆలోగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి జగన్ మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన విషయాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశానని, దీంతో ఏమ్మా జగన్.. సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టేశావట కదా అని ఆయన ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలను, పార్క్, రైతు బజార్, డైరీ ఫార్మ్, వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను, ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news