భవిష్యత్‌లో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడబోను : హనుమ విహారి

-

భవిష్యత్తులో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడబోనని సీనియర్ క్రికెటర్ హనుమ విహారి ప్రకటించాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మధ్యప్రదేశ్ తో క్వార్టర్ ఫైనల్ లో 4పరుగుల తేడాతో ఆంధ్రా జట్టు ఓడిన తర్వాత విహారి ఈ మేరకు పోస్టు చేయడం కలకలం రేపుతోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఓ రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించినా జట్టు, ఆట పట్ల ప్రేమతో రంజీ సీజన్ ముగిసేవరకు కొనసాగినట్టు చెప్పాడు.

రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో..17వ ఆటగాడిపై అరిచానని విహారి తెలిపాడు. ఆ ఆటగాడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి చెప్పగా ఆయన తనపై చర్యల కోసం ఏసీఏపై ఒత్తిడి చేసినట్టు విహారి వెల్లడించాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు విజయం సాధించిందని ఈ విషయంలో తన తప్పు లేనప్పటికీ కెప్టెన్సీ నుంచి తప్పించారని అన్నాడు. వ్యక్తిగతంగా తాను ఎవరినీ ఏమీ అనలేదని స్పష్టం చేశాడు.

https://www.instagram.com/p/C3zbrqdt_UP/?utm_source=ig_embed&ig_rid=602041f7-5bb4-40dd-ac15-808019f39803

Read more RELATED
Recommended to you

Latest news