నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్స్ పిటిషన్ల పై ఇవాళ విచారణ జరుగనుంది. స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో టీడీపి అధినేత చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా మళ్లీ వాయిదా పడుతుందా అనే అంశం పై టీడిపి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
నేడు చంద్రబాబుకు సంబంధించిన 4 పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణ జరుగనుంది. తన రిమాండ్ రిపోర్ట్ సస్పెండ్ చేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగనుంది.
స్కిల్ స్కాంలో చంద్రబాబు వేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరుగనుంది. చంద్రబాబును ఐదు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటీషన్ పైన, ఆవుటర్ రింగ్ రోడ్, అంగల్లు ఘర్షణ, విజయనగరం కేసులపై చంద్రబాబు తరపున వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరుగనుంది. హైకోర్టులో విచారణకు రానున్న ఈ పిటిషన్ల విచారణ ఏ విధంగా ఉంటాయననే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రిలోనే భువనేశ్వరి, బ్రాహ్మిణి , బాలకృష్ణ సతీమణి వసుంధర బస చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన లోకేశ్ ఇవాళ రాజమండ్రి రానున్నట్టు సమాచారం అందుతోంది. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.