ఎడిట్ నోట్: గేమ్‌ఛేంజర్.!

-

దేశ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు నూటికి నూరు శాతం న్యాయమైన బిల్లు..అందులో ఎలాంటి డౌట్ లేదు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అందరూ స్వాగతించే విషయమే. అయితే ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆమోదముద్రవేయనున్నారు. ఇక ఈ బిల్లుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆమోదముద్ర పడే అవకాశాలు ఉన్నాయి.

అయితే బిల్లు ఆమోదం పొందితే దేశ రాజకీయాల్లో సంచలనం అవుతుంది. అదే సమయంలో ఎన్నికల ముందు ఈ బిల్లు తీసుకొచ్చిన బి‌జే‌పికి గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. దేశంలో సగం జనాభా మహిళలే. మహిళా ఓటు బ్యాంకు సగం వరకు ఉంది. వారే గెలుపోటములని తారుమారు చేయగలరు. ఇలాంటి సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి బి‌జే‌పి సరికొత్త రాజకీయానికి తెరలేపింది. ఈ అంశం రాజకీయంగా బి‌జే‌పికి బిగ్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

కాకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ బిల్లుని ఆమోదించుకోవాలి. అలాగే పూర్తిగా అమలు చేయాలి. పైగా ఈ ఎన్నికల్లోనే దీన్ని అమలు చేస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అటు కేంద్రంలో లోక్ సభ, రాజ్యసభ లోనే కాదు. రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ,మండలి స్థాయిలో కూడా ఈ 33 శాతం రిజర్వేషన్ అమలైతే..చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

అయితే ఇప్పటివరకు మహిళలకు పదవులు దక్కిన..పెత్తనం మాత్రం వారి భర్తల చేతుల్లోనే ఎక్కువ ఉందనేది జగమెరిగిన సత్యం. అలాంటి పెత్తనం లేకపోతే మహిళా రిజర్వేషన్ పూర్తిగా విజయవంతమైనట్లే. మొత్తానికైతే బి‌జే‌పికి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది రాజకీయంగా గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news