చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 19 కి వాయిదా వేసింది. కౌంటర్ వేయడానికి సిఐడి న్యాయవాది సమయం కోరడంతో.. ఈనెల 19 లోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది.

హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండడాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారిస్తే క్వాష్ పిటిషన్ పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నారా చంద్రబాబు గత శనివారం అరెస్టు అయిన విషయం తెలిసిందే. వారం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు.

అయితే సిఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మద్యంతర బెయిల్ ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఎసిబి కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news