విజయవాడలో దారుణ ఘటన..14 ఏళ్లు కుర్రాడు మృతి… వీడియో వైరల్!

-

విజయవాడ నగరంలో కలచివేసే హృదయ విదారక ఘటన ఒకటి వైరల్‌ గా మారింది. మళ్లీ విజయవాడ మహా నగరంలో మొదలైంది వర్షం. ఇప్పటికే వరదతో అల్లాడిపోతున్న విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. నిన్న అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Heartbreaking incident in Vijayawada city

ఇలాంటి తరుణంలోనే.. వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో పలు చోట్ల జరిగిన ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news