రేవంత్ కుట్రలో ఎస్సీలు ఆగమవుతున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

తెలంగాణలో గత కొద్దిరోజులుగా గురుకులాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్నటివరకు కాంట్రాక్టు ప్రాతిపాదికపై సేవలందించిన టీచర్లు సుమారు 6వేలకు పైగా తొలగించారని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, గురుకులాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, టీచర్లు లేక పాఠాలు సరిగా జరగడం లేదని విద్యార్థులు సైతం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ గురుకులాపై సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

‘గురుకులాల్లోని 2వేల మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి.కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్యను అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుకు ఎస్సీ విద్యార్థులు ఆగం అవుతున్నారని ఆర్ఎస్పీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలపై ద‌ృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news