ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది వాతావరణ కేంద్రం.
ఈ తరుణంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, బాపట్ల వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని వెల్లడించారు. అంతర్వేది నుంచి పెరుమల్లాపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్ద గొల్లపాలెం వరకు అతివేగంతో అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసారు.