ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. అయితే.. ఈ సెలవులు రెండు జిల్లాల్లో మాత్రమే. భారీ వర్షాలు హెచ్చరికలతో అల్లూరి, అనకాపల్లి జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్లు. ఇక రేపు ఆదివారం కావడంతో… రెండు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
ఇక అటు విజయవాడలో ఎడతెగని వర్షం పై అధికారులను అలెర్ట్ చేశారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్రతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి నారాయణ….రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. డ్రైనేజీలలో నీటి పారుదలకు ఆటంకాలు లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలని మంత్రి నారాయణ సూచనలు చేశారు.