కోస్తాంధ్ర జ‌ల‌మ‌యం..స్తంభించిన జ‌న జీవ‌నం

-

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మంగళవారం రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.. వాయుగుండం ప్రభావం సముద్రంపై ఇంకా కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. రాజ‌మండ్రి, కాకినాడ, విజయవాడ నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరాల్లోని అనేక అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృతరూపం దాల్చింది. కృష్ణా కరకట్టపై ఉన్న ఇళ్లలోకి నీరు వస్తోందని, ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురికి హెచ్చరికలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news