గృహ నిర్బంధం నుంచి మాజీ ముఖ్యమంత్రి విడుదల.

-

దాదాపుగా సంవత్సరకాలం గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ గృహనిర్భందం నుంచి విడుదలయ్యారు..కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేసిన తరువాత జమ్మూలో స్థానిక ప్రజలు నిరసనలు చేపట్టారు..నిరసనలు హింసాత్మాకంగా మారే ప్రమాదం ఉందన్న ఐబీ వర్గాల సమాచారణం మేరకు మాజీ సీఎంను గృహనిర్బంధం ప్రభుత్వం నిర్బంధం చేసింది..ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్భందంలో ఉంచారు..ముఖ్యంగా ముఫ్తీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను,ఒమర్ అబ్దుల్లాను కూడా గృహనిర్బంధం చేసింది కేంద్రం..మెహబూబా ముఫ్తీ గతేడాది ఆగస్ట్‌ 5న ముఫ్తీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..అయితే తన తల్లికి గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని ముఫ్తీ కూతురు సుప్రీం కోర్టులతో పిటిషన్‌ దాఖలు చేసింది..జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితితులపై పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రానికి పోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు..తదుపరి విచారణ వాయిదా వేసింది..ఐతే ఇప్పుడు కశ్మీర్‌లో పరిస్థితి అదుపులోకి రావడంతో ఒక్కొక్కరిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేశారు. ఫిబ్రవరిలో ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్భందం నుంచి విడుదల చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news