ఏపీ ప్రజలకు గుడ్​న్యూస్.. ఏప్రిల్‌ నుంచే రూ.4వేల పింఛన్ పెంపు

-

ఏపీలో పింఛన్ పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 24 గంటల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్‌ జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు చెప్పినందున అధికారులు వివరాల సేకరణ పనిలో బిజీ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉఁడగా.. వీరికి పింఛను నగదు చెల్లింపులకుగాను నెలకు రూ. 1939 కోట్ల ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్‌ నుంచే రూ. 4 వేల పింఛన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7 వేల రూపాయలు చొప్పున, దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్‌ను కలిపి జులై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు రూ. 2800 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news