ఏపీలో భారీ వర్షాలు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ..!

-

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత రెండు మూడు రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ కురవనంతగా ఈసారి వర్షం కురిసింది. అయితే వర్షాలు, వరదల పై ఏపీ హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం మీద 294 గ్రామాలు  ముంపు బారిన పడ్డాయని తెలిపారు. ఇప్పటి వరకు 13, 227 మంది పునరావాస శిబిరాలకు తరలించింది ప్రభుత్వం.

వర్షాలు.. వరదల కారణంగా ఏపీలో ఇప్పటివరకు  తొమ్మిది మంది మృతి చెందినట్టు మంత్రి అనిత అధికారికంగా ప్రకటించింది. 14 జిల్లాల పరిధిలో 1,56,610 ఎకరాల్లో వరిపంట మునిగిపోయింది. దాదాపు 18,045 ఎకరాల మేర ఉద్యాన పంటలకు నష్టం కలిగిందని వెల్లడించారు మంత్రి అనిత. ఏడు జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహయక చర్యలు కొనసాగుతున్నాయి.  మొత్తంగా 9 NDRF, 8 SDRF బృందాలతో సహయక చర్యలు చేపడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల కోసం బోట్లు.. ఓ హెలీకాఫ్టర్ సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news