గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గుడ్లవల్లేరు అనేది కేవలం నలుగురి మధ్య ప్రేమ వ్యవహారం మాత్రమే.. అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవు క్లారిటీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాల కేసుపై స్పందించిన లోకేష్… ప్రశ్నలు వేసిన మీడియా ప్రతినిధులపై ఎగిరెగిరిపడ్డారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఎక్కడా లేవని తేల్చి చెప్పారు.
ఏ వీడియోలు బయటికి రాలేదన్నారు. నలుగురు మధ్య తలెత్తెన్న వివాదాన్ని పట్టుకొని కొందరు రచ్చ చేస్తున్నారని ఆగ్రహించారు మంత్రి నారా లోకేష్. విద్యార్థులు ఎక్కడ హిడెన్ కెమెరాలను చూపించలేక పోయారన్నారు మంత్రి నారా లోకేష్. విద్యాశాఖ మంత్రిగా నేను ఉన్నాను కాబట్టే ఇంకా ఎక్కువ దు ష్ప్రచారం జరుగుతుందని ఆగ్రహించారు. వాస్తవాలు తెలుసుకొని మీడియాలో ప్రచురించాలని కోరారు మంత్రి నారా లోకేష్.
https://x.com/TeluguScribe/status/1830158468277211399