పోలీసులను వీఆర్‌లో ఉంచడంపై హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. పోలీసులను వీఆర్‌లో ఉంచడంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు హోంమంత్రి అనిత. వీఆర్‌లో ఉన్న పోలీసులకు గత ప్రభుత్వం జీతం ఇవ్వలేదని ఆగ్రహించారు. పోలీసులను వీఆర్‌లో ఉంచితే గతంలో 50 శాతం జీతం ఇచ్చేవారని తెలిపారు.

కక్ష పూరితంగా గత ప్రభుత్వం పోలీసులను వీఆర్‌కు పంపిందన్నారు. కొందరు పోలీసులకు గత ప్రభుత్వం 3-4 ఏళ్లు జీతాలు ఆపిందని ఫైర్ అయ్యారు. ఉద్యోగిపై వీఆర్‌ను ఎత్తివేయగానే పెండింగ్ వేతనం ఇస్తున్నామని ప్రకటించారు. వీఆర్‌లో పోలీసులకు వేతనం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు హోంమంత్రి అనిత.