లక్డికాపూల్ హైదరాబాద్ మేయర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి లక్డికాపూల్ లోని మొఘల్ రెస్టారెంట్లో తనిఖీలు చేసారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. అయితే మొఘల్ రెస్టారెంట్ లో తనిఖీల్లో భాగంగా కిచ్చెన్, వాష్ ఏరియా ను పరిశీలిచారు మేయర్. ఇక కిచెన్ లో అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించిన మేయర్.. ప్రిజర్వ్ చేసిన మాంసం ను కూడా రెస్టారెంట్ లో గుర్తించారు. దీంతో హోటల్ నిర్వహణ తీరుపై యజమానులపై ఫైర్ అయ్యారు మేయర్ గద్వాల విజయలక్ష్మి.
ఇక ఆ రెస్టారెంట్ లోని ఫుడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపమని అధికారులను ఆదేశించారు మేయర్. అదే విధంగా ఫుడ్ కలర్ వినియోగం పై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు మేయర్. అయితే మొఘల్ రెస్టారెంట్ నిర్వహణ సాగిగ్గ చేయకుండా… అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న హోటల్ పై చర్యలకు ఆదేశించారు మేయర్.